

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్)
జనం న్యూస్ జులై 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన వెండి బంగారు వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన పార్టీ కార్యాలయంలో శాలువతో సత్కరించారు, అనంతరం అధ్యక్షుడు బెజ్జారపు నవీన్ శుక్రవారం నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కి ఆహ్వానం పలికారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బెజ్జారపు నవీన్, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి వెంకటేష్, ఉపాధ్యక్షులు గాలిపెల్లి నాగరాజ్, కోశాధికారి ఇల్లందుల ఉదయ్, సహాయ కార్యదర్శి తోకేటి నరేష్, కార్యవర్గ సభ్యులు తిప్పవరం అశోక్, తుమ్మనపల్లి మారుతి తదితరులు పాల్గొన్నారు