

జనం న్యూస్ జులై 8 నడిగూడెం
మండల పరిధిలోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ నందు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఖరీఫ్ సీజన్ నందు అధిక సాంద్రత పత్తి సాగుబడి పంట మెళకువల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.ప్రతి మంగళవారం రైతుల కోసం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ కె.రేణుక సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ వీక్షించారు.