Listen to this article

జనం న్యూస్ జూలై 08 వికారాబాద్ జిల్లా రిపోర్టర్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. రవీందర్ కొండల  కుమారుడు జ్యోతిరాధిత్య పుట్టినరోజు సందర్భంగా సొంత ఖర్చుతో (20,000/-) సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఇకపైన పాఠశాలకు ఏ అవసరం ఉన్న నా వంతు సాయం చేస్తానని అన్నారు.అంతేకాకుండా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సుమారు 200 పుస్తకాలు లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రారంభించడానికి వచ్చిన జిల్లా నాయకులు మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి , ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప , జిల్లా నాయకులు పేట శంకరన్న  మోహన్ రెడ్డి , రాజుగారు, శ్రీశైలం  వెంకటయ్య , కృష్ణ చారి , శ్రీశైలం , శ్రీనివాస్ చారి  శ్రీశైలం రజక , నరసింహులు  శ్రీను , పల్లెకువ శంకర్ , డప్పు అశోక్  పంబల్ల వీరేష్  తదితరులు పాల్గొనడం జరిగింది.