Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జులై 8

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల దివంగత నేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జడ్పిటీసి వెన్నా ఇందిరా, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి పూల మాల వేసి నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం వైసిపీ నాయకులు మాట్లాడుతూ రైతు బాంధవుడు, ఆరోగ్య శ్రీ ప్రధాత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేదల కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సంక్షేమం అందించిన మహనీయుడు అని అన్నారు ఈ కార్యక్రమం లో కోప్షన్ అక్బర్ వలి,ఉపసర్పంచ్ వెన్నా పెద్ద సత్య నారాయణ రెడ్డి,మండల వైసిపీ నాయకులు దేవిరెడ్డి రమేష్ రెడ్డి, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి,పోలేబోయిన ముసలయ్య,దర్బాసుల కాశయ్య, కుందురు సత్యనారాయణ రెడ్డి,గుమ్మా ప్రసాద్,వైసిపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు