

శాయంపేట,జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్ అభిమాని మారపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మారపల్లి సుధాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పండ్లు, స్వీట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ..రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రైతు రుణమాఫీ, ఉచిత విద్య, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ పథకం, పావలా వడ్డీ రుణాలు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అల్లె అర్జున్, రాజు కుసుంబ రాజు రాజిరెడ్డి సాంబ రెడ్డి కిషన్ మల్లయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు….