

జనం న్యూస్ 9జూలై. కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
మంగళవారం తెల్లవారుజామున జైనూర్ పోలీసులు గస్తీ (పెట్రోలింగ్ )నిర్వహిస్తున్న సమయంలో మూడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని జైనూర్ ఎస్ ఐ రవికుమార్ తెలిపారు. ఘటన స్థలము లోనే మూడు ట్రాక్టర్లతో పాటు భారీ మొత్తంలో ఇసుకను స్వాధీనం చేసుకొని, సంబంధితుల వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోలీసుల ద్వారా ప్రతేక నిఘా కొనసాగుతుందని ఎవరుకూడా చట్ట విరుద్ధ కార్య కలపల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.