Listen to this article

రాజేందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ జులై 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ మరియు రాస్తారోక్ చేయడం జరిగింది. ఈ సంధర్భంగా జె రాజేందర్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మాట్లడుతూ. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు, కార్మిక హక్కులు హరించబడతాయి. రోజు వారి కూలీ పెంపుదలకు, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి బలహీనపడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధికి గ్యారంటీ లేకుండా పోతుంది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీ నం 282 తీసుకొచ్చింది కార్మికుల పని గంటలు పెంచే జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలి బానిసత్వంలోకి నెట్టే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కేవీపీయస్ జిల్లా కార్యదర్శి దినకర్ డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బొగే ఉపేందర్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ టీఏజీ ఏ జిల్లా అధ్యక్షురాలు మాలాశ్రీ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి నంది పద్మ వనిత రాజేశ్వరి ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప సునీల్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలకిషన్ ఐకేపీ వి వో ఏ సంఘం జిల్లా అధ్యక్షులు బుద్దు మధ్యాహ్న భోజనం యూనియన్ జిల్లా కార్యదర్శి మాయ్య మాట్ల రాజు సమ్మయ్య నవీన మరియు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు