Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

బాల్యం నుంచే పిల్లల దినచర్య పై శ్రద్ధ చూపాలి మొబైల్‌ తాంత్రిక ప్రయోగం నుంచి వారిని కాపాడు కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉందిమొబైల్ ఫోన్లు, టీవీలు వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి పిల్లలు జంక్ ఫుడ్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి ఎంత ఇష్టపడినా, తల్లి దండ్రులు వారికి అలాంటి ఆహారం ఇవ్వకూడదు.నందలూరు మండలంలోని విస్డం స్కూల్ నందు స్కూల్ యాజమాన్యం నిర్వహించిన వంటి తల్లిదండ్రులకు సమావేశాంనకు ప్రముఖ రాష్ట్రస్థాయి సెలబ్రేటెడ్ అకడమీషన్ మోటివేటర్ మరియు సైకాలజిస్ట్ అయినా కృష్ణ కర్లపూడి హాజ రయ్యారు.ఈ సందర్భంగా ఆయన తల్లితండ్రులతో మాట్లాడుతూ పిల్లలకు సరైన దిశ నిర్దేశం పెంపకంలో నైపుణ్యం తన ప్రసంగంలో పిల్లల దినచర్య ఎలా ఉండేలా తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివ రించారు.అలాగే పిల్లలు ఎదగడానికి సరైన దినచర్యను కలిగి ఉండటం ప్రాముఖ్యతను కూడా ఆయన వివరిం చారు.సూర్యోదయానికి ముందే నిద్ర నుంచే పిల్లలను లేపాలని పిల్లల్ని కూర్చోబెట్టి కాసేపు చదివి పించాలని.తరువాత స్నానం చేయించి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తినిపించి స్కూలుకి పంపించాలి అని.పిల్లలు జంక్ ఫుడ్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి ఎంతఇష్టపడినాతల్లిదండ్రులు వారికి అలాంటి ఆహారం ఇవ్వకూడదు అని.పిల్లలు సంకోచం లేకుండా తమతో ప్రతి విషయాన్ని పంచు కునేలా సౌకర్య వంతంగా ఉండేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని అప్పుడే వారు అన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు అని.ఇలా చేయడం వల్ల పిల్లల్లో కృతజ్ఞతా భావం ఏర్పడు తుంది అని.పిల్లలు సమస్యలను పరిష్కరించ డానికి నిరంతరం ప్రతిఘటించడం ఒక మార్గం అయితే,తల్లిదండ్రులు సమస్యలను సముచితంగా ఎలా పరిష్కరించాలో పిల్లలకు నేర్పించే వరకు వారికి కష్టంగా ఉంటుంది అని. ఇది వారిని ఎల్లప్పుడూ విజయవంతంగా చేస్తుంది అని.మొబైల్ ఫోన్లు,టీవీలు వంటి వాటికి దూరంగా ఉండాలి అని.ప్రత్యేకంగా, పిల్లలకు మొబైల్ కారణంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, దృష్టిసంబంధ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది అని.ఎక్కువసేపు వాడడం వల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు, శారీరక సమస్యలు కూడా ఎదురవుతాయి అని. కంటి సమస్యలు,నిద్రలేమి,తిండి అలవాట్లలో మార్పులు రావడం వంటి సమస్యలు కనిపించ వచ్చు.కాబట్టి, పిల్లలు ఎంత సమయం మొబైల్ ఉపయో గిస్తున్నారు అన్నది తల్లిదండ్రులు గమనించడం అవసరం అని.మొబైల్‌ తాంత్రిక ప్రయోగం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది అని పిల్లలు మొబైల్‌ వాడుతుంటే పిల్లల ఆన్‌లైన్‌ యాక్టివిటీని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి అని తల్లిదండ్రుల జాగ్రత్తలు పిల్లలకు మొబైల్ వినియోగానికి ఒక పరిమితి విధించాలి అని వారిని బహిరంగ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి అని.విద్యా సంబంధిత యాప్స్ మాత్రమే వాడేలా చూడాలి.రాత్రిపూట మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించాలి.ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు మొబైల్ వినియోగం వల్ల కలిగే ముప్పులను తగ్గించు కోవచ్చు అని.భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా,ఆనందంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు.ఈ సమావేశంలో విద్యార్థి విద్యార్థులకు మరియు తల్లితండ్రులకు మంచి విషయాలు తెలియజేసి నందుకు హర్షం వ్యక్తం చేశారు స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.