

జనం న్యూస్,జూలై09,అచ్యుతాపురం:
కార్మికుల నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అచ్యుతాపురంలో ర్యాలీ,మానవహారం, మోడీ సారు కార్మిక చట్టాలు రద్దు చేయాలని వినూత్న కళారూపం ప్రదర్శించి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కే. సోమనాయుడు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము,కౌలు రైతు సంఘం నాయకులు రామ సదాశివరావు మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులు కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దుచేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తుందని, ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పి కార్మికులు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశా,విఏఓ, అంగన్వాడి, మిడ్ డేమీల్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సెజ్ లో కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఆటో ముఠా బిల్డింగు కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ నాయకులు విశ్వేశ్వరరావు, రమణ, అంగన్వాడి యూనియన్ నాయకులు నారాయణమ్మ, నాయకులు లావణ్య, రమణ, మంగమ్మ, సూర్య, ముఠా నాయకులు సత్తిబాబు,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు