

జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
గత కొన్ని రోజులుగా జైనూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రింద పేర్కొన్న సూచనలు పాటించగలరు: నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదు – నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రమాదకరం మరియు వర్షాలు కురిసే సమయంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదు.మురుగు కాలువలు, ఓవర్ఫ్లో అయిన కుంటలు దాటి వెళ్లవద్దు – గుంతలు, నీటిలో కరెంటు లీకేజ్ ఉన్న అవకాశం ఉంటుంది.విద్యుత్ తీగలు నేలపై పడివున్నచో – వాటిని తాకకుండా వెంటనే స్థానిక విద్యుత్ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.తక్కువ భద్రత ఉన్న ఇళ్లలో నివాసముంటే – తాత్కాలికంగా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లగలరు. పిల్లల్ని నీరు నిండిన ప్రాంతాల్లో ఆడనివ్వవద్దు – ప్రమాదం జరగవచ్చు.వాహనదారులు నెమ్మదిగా నడిపించండి – తడిగా ఉండే రోడ్లపై ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.తరచూ ప్రభుత్వ ప్రకటనలు వినండి – న్యూస్ ఛానెళ్లు, అధికారిక సోషల్ మీడియా ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు. అత్యవసర సహాయానికి వెంటనే సంప్రదించవలసిన నంబర్లు:
పోలీస్: 100
అంబులెన్స్: 108
జైనూర్ పోలీస్ స్టేషన్
8712670587