

మాదకద్రవ్యాల రహిత జిల్లా కోసం విద్యార్థులు, యువత, ప్రజలు పోలీసులతో తమ వంతు చేయి కలపాలని ఎస్పీ సూచన
జనం న్యూస్ జులై 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు, యువత,ప్రజలు పోలీసులతో తమ వంతు చేయి కలపాలని ఎస్పి కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… “మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోంది. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల ముప్పు గురించి తెలుసుకొని, వాటిని పూర్తిగా దూరం పెట్టాలి” అని సూచించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది గ్రామస్తులకు, విద్యార్థులకు, యువతకు నష్టం కలిగించే డ్రగ్స్ వంటి మానసికంగా, శారీరకంగా దెబ్బతీయే పదార్థాల గురించి వివరించి, ఆరోగ్య పరిరక్షణపై స్పష్టత కల్పిస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా చెడు వ్యసనాలకు లేదా డ్రగ్స్ కి అలవాటు పడితే వెంటనే 1908 లేదా 8712670551 నెంబర్ కి సంప్రదించాలని తెలిపారు. మాదకద్రవ్యాల నివారణకు అందరి సహకారం అవసరమని ఎస్పీ పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు, వివిధ గ్రామాల్లో ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పభావాలపై ఆయా సర్కిల్స్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ స్టేషన్స్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్స్, మరియు పోలీస్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.