

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నలదిమాయపల్లెలోని ఎంపీయుపీ పాఠశాల నందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని గురు పూర్ణిమ సందర్భంగా పాఠశాలలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించిన నలదిమ్మా యపల్లి సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో అందరికీ భోజనాలు వడ్డించడం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు మరియు మిగతా నాయకులు తదితరులు పాల్గొన్నారు