

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు నందు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందలూరు జనసేన పార్టీ యువ నాయకులు గురువి గారి వాసు ఆహ్వానం మేరకు శ్రీ సోమనాథ స్వామి నీ జనసేన నాయకుడు అధికారి కృష్ణ దర్శించుకున్నారు తదనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు తదనంతరం అతికారి కృష్ణ స్వామివారి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుండి వచ్చే స్వామివారి భక్తులు కోసం ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఆటోలను ప్రారంభించారు ఈయనతో పాటు రాజంపేట ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు మరియు కుమారులు యెద్దుల విజయసాగర్ కేదార్నాథ్ ఎలక్ట్రికల్ రమణ కేఎస్ నరసింహ మరియు కొరముట్ల హరి మరియు జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు