Listen to this article

జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

తల్లికి వందనం పథకం పట్ల వస్తున్న మోసపు కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయనగరం వన్‌ టౌన్‌ సీఐ శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలో బీపీఎం పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రులకు పలు సూచనలు అందజేశారు. తల్లికివందనం డబ్బులు జమ కాలేదని, అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాళ్లు పంపించిన లింకులు క్లిక్‌ చేయవద్దన్నారు. డబ్బుల జమపై అధికారకంగా ఎవరూ ఫోన్లు చేయరని, గమనించాలని సూచించారు.