

జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీ
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం వెదుళ్ళపల్లి శ్రీ బొల్లి మునియ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరియు గురుపౌర్ణమి సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రావిపాటి హేమంత్ కుమార్ (హిందీ), కొత్త సూరిబాబు (ఇంగ్లీష్), నాగేంద్ర (గణితం) వారిని ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, మండల బిజెపి అధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి, మట్టడి రమణ నీరుకొండ శ్రీను,సుర్గారావు, కొండలరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
