Listen to this article

బిచ్కుంద జూలై 11 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పాఠశాల గేటు పక్కన ఉన్న చికెన్, మటన్ షాపు నిర్వాహకులు వ్యర్థాలను పాఠశాల ఆవరణలో పడేస్తున్నారని, మందుబాబులకు అడ్డాగా మారిందని బిచ్కుంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లు ఆరోపిస్తూ బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మాంసపు వ్యర్ధాలు, బొక్కల కోసం కుక్కలు పాఠశాల ఆవరణలోకి వచ్చి విద్యార్థులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అని అలాగే దుర్వాసన భరించలేక చదువులపై సరిగా శ్రద్ధ చూపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో మందుబాబులకు అడ్డగా మారిందని నిరసన వ్యక్తం చేసినారు. వెంటనే చర్య తీసుకోని చికెన్ మటన్ షాపులను తొలగించాలంటూ మున్సిపాల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.