Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 11 రిపోర్టర్ సలికినీడి నాగు

పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం మరియు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి సహకారంతో, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS) ఆదేశాల మేరకు, జిల్లా లో హెచ్‌ఐవీ నివారణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు హై రిస్క్ ఉన్న వ్యక్తులకు హెపటైటిస్ B మరియు C పరీక్షలు నిర్వహించి, హెపటైటిస్ నెగటివ్‌గా తేలినవారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “హెచ్‌ఐవీతో పాటు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు,” అని తెలిపారు. జులై 11, శుక్రవారం నాడు క్యాంప్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో. 35 మంది లబ్ధిదారులకు హెపటైటిస్ పరీక్షలు నిర్వహించామని, అందులో నెగటివ్‌గా వచ్చిన వారికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.