Listen to this article

రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు

జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

తెలంగాణ రాష్ట్రం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వర్ష వాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా లో నిర్వహిస్తున్నా వర్ష వాస్ కార్యక్రమాల పనితీరుపై పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన అనంతరం మాట్లాడారు. మూఢనమ్మకాలను నమ్మకుండా భారత రాజ్యాంగ నిర్మాతడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, తథాగత్ భగవాన్ బుద్ధుడు చూపిన సన్మార్గంలో నడవడానికి రాష్ట్ర ప్రజలను సమాయత్తం చేస్తున్నట్లు అందులో భాగంగానే జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నామని అన్నారు. బుద్ధునితో నా ప్రయాణం అనే తెలుగు సాంస్కృతిక నాటకాన్ని ప్రజలు తప్పకుండా చూడాలని,ఆయన అన్నారు.అదేవిధంగా జిల్లాలో భారతీయ బౌద్ధ మహాసభ అధ్వర్యలో జరుగుతున్నా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రం లోని గాయత్రి లాడ్జి లో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్వహించారు.అంతకు ముందు జిల్లా కేంద్రానికి వచ్చిన భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు తోపాటు వచ్చిన జాతీయ ఉపా అధ్యక్షులు సూర్యప్రకాష్ ,బాలాజీ, సునీల్ లను జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తుకారాం,కోశాధికారి దుర్గం తిరుపతి,గౌరవ అధ్యక్షులు శ్యామ్ రావు,నాయకులు జయంత్ కుమార్,సంతోష్ , లక్ష్మణ్ ప్రశాంత్ అధితరులు పాల్గొన్నారు