Listen to this article

భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు

జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

దేశ విదేశాల్లో నెలకొన్న పరిస్థితులను అదుపులో ఉంచడానికి బుద్ధిని మార్గమే అవసరమని భారతీయ బౌద్ధమహాసభ జాతీయ ఉపా అధ్యక్షులు,నల్ల సూర్య ప్రకాష్,రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ పరంధాములు అన్నారు.గురువారం రాత్రి వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో నిర్వహించిన 34వ వర్ష వాస్ కార్యక్రమాన్ని,ప్రహ్లాద్ ముండే ఫంక్షన్ హాల్ లో బుద్ధునితో నా ప్రయాణం నాటిక ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు బౌద్ద గురించి అందరికీ తెలియజేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ “బుద్ధులతో నా ప్రయాణం ” అని నాటికను వర్షవాస్ కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న జిల్లాలలో వర్షపాస్ కార్యక్రమం ఉదృతంగా నిర్వహిస్తున్నారని ఈ సాంప్రదాయాన్ని దక్షిణ తెలంగాణ వైపు తీసుకువెళ్లి ప్రజలను భాగస్వాములు చేనున్నట్లు వారు తెలిపారు. బౌద్దుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం బౌద్ధ కార్యక్రమాలను అంబెడ్కర్ కార్యక్రమాలను నిర్వహించాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని బహుజనుల అందరికీ అంబేద్కర్, బుద్ధుని ఆశయాలను తెలియజేయడానికి భారతీయ బౌద్ధమసభ కృషి చేస్తుందని బహుజనలందరూ ఈ మహనీయుల బాటలో నడవాలని ఆయన పేర్కొన్నారు. 34 వర్ష వాస్ కార్యక్రమానికి , బుద్ధుడితో నా ప్రయాణం కాని తెలుగు నాటికను ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ బౌద్ధమసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు, జాతీయ ఉపాధ్యక్షులు నల్ల సూర్య ప్రకాష్, అదే విధంగా రాష్ట్ర నాయకులు అయినటువంటి బాలాజీ గాయక్వాడ్, డాక్టర్ సునీల్ కుమార్ ని బుధవారం రాత్రి భారతీయ బౌద్ధమసభ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, సిద్ధార్థ యువజన సంఘం, వర్షపాస్ కమిటీ,రమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు జిల్లా, మండల నాయకులు శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్, భారతీయ బౌద్ధమసభ మండల అధ్యక్షులు దుర్గం దుర్గాజి ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే గౌరవ అధ్యక్షులు జయరాం ఉప్రే, సమాజ అధ్యక్షులు ఉప్రే,ఉపాధ్యక్షులు దుర్గం శ్యామ్ రావు దొండుజి, సునీల్ దుర్గే, నాయకులు ప్రతాప్, రోషన్ ఉప్రే, అరుణ్ రాజేంద్రప్రసాద్ దుర్గం సుధాo, జయంత్ కుమార్, జైపాల్, మహేష్ కొయ్యాల ,మారుతి రమేష్ మనోజ్ నూతన్ తదితరులు పాల్గొన్నారు.