Listen to this article

బీసీల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం

జనం న్యూస్ జూలై 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఫ్లైఓవర్ దగ్గర విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం మంత్రివర్గం తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకురావడానికి నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల బీసీ సంఘం నాయకులతో కలిసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.