

జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి.
ఇందూర్ నగరం: ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా అనుబంధ సంఘాల నూతన అధ్యక్షులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ఈ గెలుపుతో మీ బాధ్యతను మరింత పెంచిందని వారికి సూచించారు. గెలువడమే కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘ అభివృద్ధికి పాటు, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేసి సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. అనంతరం ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన, ఎన్ని కుట్రలు చేసిన చివరికి ధర్మమే గెలిసిందన్నారు. ఈ గెలుపు తన ఒక్కరిది కాదని తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన సంఘం పెద్దలు మరియు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి విజయంగా పేర్కొన్నారు వారందరికీ పేరు, పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన పైన నమ్మకంతో భారీ విజయాన్ని కట్టబెట్టిన ఆర్యవైశ్యుల నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి మరియు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తాని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఇంగు శివప్రసాద్, పాల్థి రవికుమార్, ఇల్లందుల సుధాకర్, లిఖిత్, వివేకానంద, నవీన్ తదితరులు పాల్గొన్నారు