Listen to this article

ముమ్మిడివరం మండలం ఠాణే లంక పంచాయితీ ఠాణేల్లంక బాడవ శెట్టిబలిజ గ్రామం శ్రీ రామాలయం నుండి సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో మొల్లేటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ఎఫ్ మహిళ విభాగము సభ్యులు గ్రామస్తులు గ్రామదేవత శ్రీశ్రీశ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారికి ఆషాడంసారె మరియు పసుపు నీళ్ల సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా పొలిమేర దేవతలైన సత్తెమ్మ తల్లికి సలిమిడి పానకం వడపప్పు పసుపు కుంకుమ చీర జాకెట్టు గాజులు పువ్వులు సమర్పించి అక్కడ నుండి బయలుదేరి కలశములతో పసుపు నీళ్లు తీసుకుని మార్గమధ్యంలో బలుసులమ్మ తల్లికి దేవి సెంటర్లో శ్రీ కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించి వడ్డే గూడెం గ్రామంలో స్వయంభుగా వెలసిన మరిడమ్మ తల్లికి పసుపు నీళ్లు ఆషాడం సారె ను మాతృమూర్తులు మరిడమ్మ తల్లి పీఠాధిపతులు శివశక్తి గారికి అందించడం జరిగినది అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు పానకము ప్రసాదములు అందించడం జరిగినది ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రప్రదంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 8 సంవత్సరములనుండి ఎస్ ఎస్ ఎఫ్ ఆషాడం సారె సమర్పించడం ప్రారంభించి రాష్ట్రమంతటా అనేక గ్రామాలలో గ్రామ దేవతలకు సారె సమర్పించడం జరుగుతుంది అన్నారు దీని వలన గ్రామంలో అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ సుభిక్షంగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముల్లేటి కనకదుర్గ రాయుడు రాజేశ్వరి దంగేటి నాగమణి గుత్తుల శ్రీలక్ష్మి యనమదల లక్ష్మీనారాయణమ్మ బొక్కా నాగేశ్వరి దంగేటి కనకలక్ష్మి దుమ్మేటి మోహనరావు శీలం గోపాలకృష్ణ బొక్కా గోవిందరావు ఇళ్ల వెంకటేశ్వరరావు కొప్పిశెట్టి రాంబాబు బొంతు సుబ్రహ్మణ్యం శీలం లంకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.