

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఉమ్మడి కడప జిల్లాలో మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ కింద పని చేయుచున్న బాలికల పాఠశాలలు అయిన నందలూరు, వనిపెంట, తొండూరు అట్ పులివెందుల మరియు బాలురు పాఠశాలలు అయిన కమలాపురం, జమ్మల మడుగు లలో మిగిలిన సీట్లకు ఆయా పాఠశాలల్లో ఈ నెల 16 వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించును.కావున క్రింద చూపిన కేటగిరీల వారు ఆయా పాఠశాలలో ఈ నెల 14 మరియు 15 వ తేదీలలో మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు వీలు ఉంటుంది. దరఖాస్తు చేసుకొనుటకు విద్యార్థి ముందు రెండు తరగతుల స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకువెళ్ళి దరఖాస్తు చేసుకోగలరు. కమలాపురం బాలురు నందు 5 వ తరగతిలో బీసీ ఎ, బి, సి, ఈ, ఎస్సి, ఎస్టీ, ఆర్ఫన్. 6 వ తరగతిలో బిసి ఎ,బి,డి. 7 వ తరగతిలో ఈబీసీ, 8 వ తరగతిలో బిసి ఎ, సి, డి, ఎస్.సి, 9 వ తరగతిలో బి సి ఎ, బి, ఎస్.సి కేటగిరీలలో ఖాళీలు కలవు. జమ్మల మడుగు బాలురు నందు 5 వ తరగతిలో బిసి ఎ, బి, సి, డి, ఈ, ఎస్సి, ఎస్టి, ఆర్ఫన్ లలో 6 వ తరగతిలో ఎస్సి, ఎస్టి, ఆర్ఫన్ లలో, 7 వ తరగతిలో బిసి ఎ, బి, ఈ, ఎస్టి, ఆర్ఫన్ లలో, 8 వ తరగతిలో బిసి ఎ, బి, ఎస్టి, ఆర్ఫన్ లలో 9 వ తరగతిలో బిసి ఎ, బి, ఈ కేటగిరీలో ఖాళీలు కలవు. నందలూరు బాలికలు నందు 5 వ తరగతిలో బిసి ఎ, బి, డి, 6 వ తరగతిలో బిసి ఎ, బి, 7 వ తరగతిలో బిసి బి, డి, ఎస్సి లలో, 8 వ తరగతిలో బిసి ఎ,బి,డి ఎస్టి కేటగిరీలో ఖాళీలు కలవు. తొండూరు అట్ పులివెందుల నందు 5 వ తరగతిలో బిసి ఎ , ఎస్సి, ఎస్టి లలో, 6 వ తరగతిలో బిసి డి , ఎస్సి, ఎస్టి లలో మాత్రమే ఖాళీలు కలవు. వనిపెంట నందు 5 వ తరగతిలో ఈబిసి,బిసి ఎ, బి, సి, డి, ఈ, ఎస్సి, ఎస్టి, ఆర్ఫన్ లలో 6 వ తరగతిలోఈబిసి,బిసి బి, ఈ, ఎస్సి, ఎస్టి లలో 7 వ తరగతిలో బిసి ఎ, బి, డి, ఎస్సి లలో 8 వ తరగతిలో బిసి డి లో 9 వ తరగతిలో బిసి ఎ,బి, డి, ఎస్టి లలో ఖాళీలు ఉన్నాయని అర్హులు ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోగలరు అని ఉమ్మడి జిల్లాల బి సి గురుకుల పాఠశాలలు ప్రిన్సిపాల్ నాగేశ్వరి ప్రకటనలో తెలిపారు.