Listen to this article

జనం న్యూస్ జులై 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకమని సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ బీసీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు లడే రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షనీయమన్నారు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగనన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం నాయకులు వైనాల కుమారస్వామి చిందం రవి బాసాని శాంత బాసాని మార్కండేయ యండి రఫీ కుమారస్వామి మామిడి సుదర్శన్ రాజేందర్ సంపత్ రాజు తదితరులు పాల్గొన్నారు