

బిచ్కుంద జూలై 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ సర్కిల్‌కు నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం రవి కుమార్ శనివారం తన విధులకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఐజి ఆఫీస్ నుంచి ఆయనను బదిలీపై బిచ్కుంద కి సీఐగా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లోని తన కార్యాలయంలో చేరగా, ఎస్‌ఐ మోహన్ రెడ్డి తో పాటు ఇతర సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇదివరకు బిచ్కుంద సీఐగా పనిచేసిన జగడం నరేష్ ని ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు