Listen to this article

జనం న్యూస్ జూలై12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


కాట్రేనికోన మండలం చిర్ర యానం వలసల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన రామాలయంలో అక్కడ విద్యార్థులకు సాయంకాలం చదువు సంస్కారం ఆట పాట ఆచార సాంప్రదాయాలను తెలియజేస్తూ పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇస్తూ చదువులో రాణించే విధంగా ఈ సెంటర్ ద్వారా తీర్చిదిద్దడం పడుతుంది ఈ సెంటర్ ను సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గొల్ల కోటి సాయిబాబు బాలవికాస్ మాతాజీ సంఘానీ ధనకుమారి ఇల్లింగి సత్యనారాయణ ఓలేటి వెంకటేశ్వర్లు పాలెపు ధనలక్ష్మి పతిరావు అంకాడి శ్రీను స్రవంతి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొన్నారు