Listen to this article

జనం న్యూస్. జూలై 13. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

పాత రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు (1986-1987) బ్యాచ్ కు చెందినవారు.
వారంతా 38 సంవత్సరాల క్రితం నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత అందరూ ఒకే చోట కలిసి దౌల్తాబాద్ మల్కాపూర్ సమీపంలోని విఎస్ఆర్. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో వారందరికీ చదువు చెప్పిన గురువులను పూలమాల శాలువాలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.గత స్మృతులను గుర్తు చేసుకుంటూ అప్పటి రోజుల్లో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.పాత మిత్రులందరికీ గుర్తుచేసుకొని ఇలా ఒకే చోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక దృష్టి పెట్టాలనే సహచర విద్యార్థి ధ్యాన గురువు నరసింహ గౌడ్.పూర్వ విద్యార్థులతో ధ్యానం చేయించడం జరిగింది. ప్రతిరోజు ధ్యానం చేయడంతో మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థుల గురువులు రుక్మయ్య. మల్లారెడ్డి. వీరేశం. పాషామియా.ఈకార్యక్రమ సమన్వయకర్తలు.పూర్వ విద్యార్థులు.హరికృష్ణ.సూర్య ప్రకాష్ రావు.రమేష్ గుప్తా. నయీమ్ బేగ్.నాగేష్.రాజు. నర్సింగరావు.మాధవి. సుజాత.తదితరులు ఉన్నారు