

జనం న్యూస్ 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
గంజాయి సాగు చేస్తున్న కేసులో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమాన విధిస్తూ డిస్టిక్ సెషన్స్ కోర్ట్ ఆసిఫాబాద్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. ఎస్పి వివరాల ప్రకారం… గతంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.మధుకర్ పోలీస్ సిబ్బందితో తేదీ 25.10.2021 న నమ్మదగిన సమాచారం మేరకు రావునూర్ గ్రామ శివారులో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా, కోట్నాక సోము (తండ్రి: బాలాజీ, వయస్సు: 43 సం. , గ్రామం : రావునూరు, లింగాపూర్ మండలం) అను వ్యక్తి తన, అమ్మ కోటినాక మోతుబాయ్ పేరు మీద గల మూడు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయి పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని, లాభాపేక్షతో పత్తి పంటలో గంజాయిని సాగు చేశాడు. అప్పటి లింగాపూర్ ఎ.ఎస్.ఐ కాతే బీమ్ రావు (మొదటి ఐ.ఒ)వారిపై కేసు బుక్ చేసి రెండవ ఐ.ఒ (ఇన్చార్జి సీఐ) వాంకిడి సీఐ సుధాకర్ , మూడవ ఐ.ఒ జైనూర్ సీఐ హానూక్ లు విచారణ జరుపగా , ప్రస్తుత జైనూర్ సీఐ, లింగాపూర్ ఎస్ఐ లు సాక్షులను కోర్టులో హాజరుపరచగా పి.పి జగన్ మోహన్ రావు , గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ విచారణ జరుపగా, నేరం చేసినట్లు రుజువు కావడంతో నిందితుడు కొట్నాక సోము కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పి పి జగన్ మోహన్ రావు , ప్రస్తుత ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్, జైనుర్ సిఐ రమేష్, లింగాపూర్ ఎస్సై గంగన్న, కోర్ట్ ఆసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్ మరియు కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.