

జనం న్యూస్ 14 జులై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో చౌరస్తా వద్ద హైదరాబాదులో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను తీన్మార్ మల్లన్న టీం శాయంపేట మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ, “తీన్మార్ మల్లన్న ఇటీవల బీసీల కోసం ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనను తట్టుకోలేని కల్వకుంట్ల కవిత బీసీ ముసుగులో మళ్ళీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కార్యాలయంపై దాడులకు పాల్పడిన ఘటనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల్లో మద్దతు కోల్పోయిన వారు ఇప్పుడు భౌతిక దాడులకే దిగి వస్తున్నారు. దాడులకు ప్రతిదాడులు జరుగుతాయి. మళ్లీ దొరల పాలన నడుస్తుందనే సంకేతంగా, ముందుగానే మల్లన్న మీద మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఒక కుట్ర.” నిరసన అనంతరం, కల్వకుంట్ల కవితను ఏ1గా గుర్తించి, జాగృతి కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీo తీన్మార్ జయ్ సూర్య నాయక్ తండా తండా గ్రామ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు అజిత్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కొమురయ్య రవి చింతల్ నరసయ్య మరియు శాయంపేట మండలంలోని 24 గ్రామాలకు సంబంధించిన బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ సంఘాల ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు….