

జనం న్యూస్ జూలై 15 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజు పర్యవేక్షించారు సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. చిలిపిచేడు తహసీల్ కార్యాలయం సందర్శన . భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా సేకరించిన దరఖాస్తులను పరిష్కరిస్తున్న తీరును కలెక్టర్ అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. రెవిన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కార దిశగా కృషి చేయాలి అన్నారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ సహదేవ్, డిప్యూటీ తాసిల్దార్ సింధుజ, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.