

బిచ్కుంద జూలై 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బి ఎల్ ఓ లకు ఓటు నమోదు, ఓటరు కార్డు సవరణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు రచ్చ శివకాంత్, ఎర్షాద్ అలీ లు పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వారికి కొత్త ఓటు నమోదు, మరణించిన వారి మరియు వలస వెళ్లిన వారి ఓటు తొలగింపు, ఓటరు కార్డులో తప్పుల సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బి ఎల్ ఓ లకు రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ తహశీల్దార్ భరత్, రెవెన్యూ రవీందర్, సిబ్బంది, వివిధ గ్రామాల బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.