

జనం న్యూస్15-7-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా
సంగారెడ్డి అందోల్ జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నాగరాజ్ (నాని)14 వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ మరియు త్రిష కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గల్లి సోదరీమణులతో శివశక్తుల నాట్యాలతో, చప్పులు డోలు వాయిద్యాల మధ్య గల్లి నుండి మధ్య రంగం మీదుగా శ్రీ పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం అధ్యక్షులు పట్లూరి శివ శేఖర్, వార్డ్ పెద్దలు అందరూ భారీ ఎత్తున పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊరేగింపు ప్రత్యేకంగా పురవీధుల లో గుండ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం వద్దకు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాలు అమ్మవారి ఊరేగింపులో ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమ్మ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని తెలిపారు.