Listen to this article

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఎస్ ఎస్ ఎఫ్ మండల మహిళా కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి పర్యవేక్షణలో మహిళా విభాగము మరియు ఆలయ కమిటీ వారు మాతృమూర్తులు గ్రామస్తులు శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారికి మరిడమ్మ అమ్మవారికి ఆషాడం సారే సమర్పించడం జరిగింది. ముందుగా అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి తదుపరి ఆడపడుచులు అందరూ తీసుకొచ్చిన సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యులు తూనికుంట్ల ప్రతిమ వేటూరి పుష్ప యాళ్ల రత్నకుమారి కేతా రాము కుడిపూడి మహాలక్ష్మి కొప్పిశెట్టి నగ కీర్తి తదితరులు పాల్గొన్నారు