

జనం న్యూస్ జులై 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నిర్మాణం లో ఉన్న బట్టల దుకాణం లో లిఫ్ట్ కేబుల్ తెగిపోయి ప్రమాదానికి గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి.జగదీశ్వర్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారి శశిధర్ తో కలిసి పరామర్శించారు. సోమవారం ఆర్ సీ పురం మండలం బీరంగూడ కమన్ వద్ద నూతనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న బట్టల షోరూమ్‌లో పని చేయడానికి వెళ్లిన కార్మికులు లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి జనంతో నిండటంతో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ మూడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ లో కూలడం తో 14 మంది మహిళలు గాయపడగా, వారిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు అది తెలుసుకున్న అయన వెంటనే ఆసుపత్రి సిబ్బంది తో ముచటించారు,బాధితుల కు తీవ్ర గాయాలయ్యాయి, మహిళలకు ఎముకలు విరిగిపోయాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వారు తెలియజేశారు. ఇంతలో, దుకాణ యజమాని పని ప్రదేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితుల బంధువులు ఆరోపించారు.వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. ప్రమాదం గురైన వారు ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ చెందిన వారిగా గుర్తించారు.
భాధితులకి తాను అండగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు. హాస్పిటల్ సిబందితో తో మాట్లాడి ప్రమాదం జరిగిన వారికీ ఏలాంటి ఇబంది కలగవద్దు అని, వారికి త్వరగా నయం కావాలని కోరారు. వైద్యానికి సంబంధించి ఎంత ఖర్చు ఐనా సరే మెరుగైనా వైద్యం అందుంచాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు ప్రజల అండగా వెంట ఉంటుందని తెలియజేశారు.