Listen to this article

చున్నితో ఆత్మహత్య చేసుకున్న పదవ తరగతి విద్యార్థిని

జనం న్యూస్ జూలై 15 నడిగూడెం

ఊరి పెట్టుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తనుషా మాహలక్ష్మి అను విద్యార్థినిచున్నీతో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని కొనీ ఆత్మహత్య చేసుకున్నది. సోమవారం అర్ధరాత్రి తనుషా మహాలక్ష్మి తన తోటి విద్యార్థిని చున్నీ కావాలని అడిగిందని తెలిపారు. ఇలా ఆత్మహత్య కోసం అడిగింది అని అనుకోలేదని విద్యార్థిని తెలిపారు. తన పక్కన పడుకున్న విద్యార్థిని తెల్లవారుజామున లేచి చూసేసరికి తనుషా మహాలక్ష్మి కనిపించకపోవడంతో క్లాస్ రూమ్ లో గాలించగా తన తరగతి గదిలో చున్నితో ఫ్యాన్ కురేసుకొని వేలాడుతూ కనిపించిందని వెంటనే నైట్ వాచ్మెన్ బుచ్చమ్మ కు తెలపడంతో వాచ్మెన్ నైట్ డ్యూటీ చేస్తున్న ఉపాధ్యాయురాలు సునీతకు తెలిపారు. జరిగిన విషయాన్ని ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణకు, తెలియజేయడంతో వారు పై అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఈవో అశోక్ హుటా హుటిన పాఠశాలకు చేరుకొని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, నడిగూడెం ఎస్సై జి అజయ్ కుమార్ తో కలసి ఆత్మహత్య గల కారణాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మునగాల మండలం,కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు వసుంధర దంపతుల కుమార్తె అయిన నిమ్మ తనుషా మహాలక్ష్మి నడిగూడెం లోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఏడవ తరగతి చేరి ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నది. చదువులో ముందుండే విద్యార్థిని ఆకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదోనని తెలియటం లేదని ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాఠశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.