

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి
ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగము వారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత తిళ్ళాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సారె సమర్పించిరి ముందుగా ఊరి ఆడపడుచులు మాతృమూర్తులు పిల్లలు గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం పూర్తి చేసి అమ్మవారికి మేండా వారి పల్లవారి కుటుంబాల నుండి సారె కావాళ్ళు పండ్లు పువ్వులు అందించారు తరువాత ఆడపడుచులు మాతృమూర్తులు గ్రామస్తులు వారి తెచ్చిన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడియం తమ్మయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటిసారి ప్రారంభించినప్పటికీ అనూహ్యంగా భక్తులందరూ తరలిరావడం అందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారే సమర్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు ఆలయ కమిటీ చైర్మన్ అరవ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ అమ్మవారికి ఆషాడం సారె సమర్పించడం వలన అమ్మ అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉంటుంది అందరూ ఆయురారోగ్యంగా వర్ధిల్లుతారు గ్రామాన్ని అమ్మ కాపాడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో తోటకూర బాబులురాజు యాళ్ళ జై జైలు మెండా సత్యనారాయణ పళ్ళ రాంబాబు శీలం నాగరాజు కడియం సత్యవతి పెన్నాడ సుబ్బలక్ష్మి కడియం వెంకటలక్ష్మి శీలం సునీత రాచకొండ కృష్ణవేణి పుసులూరి పల్లాదేవి పేరాబత్తు రామకృష్ణారావు పితాని శ్రీనివాసరావు పెమ్మిరెడ్డీ కోటేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

