

జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తిర్యని పోలీస్టేషన్ పరిధిలోమంగళవారం ఉదయం నమ్మదగిన సమాచారం ఆధారంగా , ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఇర్కపల్లి శివారులో గల గుడుంబా తయారీ స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దర్యాప్తులో దర్వాజల మహేష్ మరియు కనుకుంట్ల శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గుడుంబా తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. దాడిలో సుమారు ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుడుంబా తయారీకి ఉపయోగించే దాదాపు 800 లీటర్ల బెల్లం ద్రావణంను నశనం చేశారు.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని, సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ చురుకైన చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఎస్‌ఐ అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.