Listen to this article

జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కజకిస్తాన్‌లో జరిగిన జూనియర్‌ ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానీని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ అభినందించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఆమెకు రూ.25 వేలు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, కోచ్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.