Listen to this article

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్ )

జనం న్యూస్ జులై 16, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో గల వేములకుర్తి గ్రామంలో ఈరోజు పెంట లింబాద్రి ఆధ్వర్యంలో గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం పెంట లింబాద్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనే నానుడి నిజం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ, మరోసారి బీసీల పట్ల కాంగ్రెస్కున్న చిత్తశుద్ధిని నిరూపించింది అని అన్నారు, ఇప్పుడు చూసినట్లయితే బిజెపిలో గాని బీఆర్ఎస్ లో గాని బీసీలకు ప్రాధాన్యత లేదని, ఆ పార్టీలలో రాష్ట్ర అధ్యక్షులు గాని జాతీయ అధ్యక్షులను చూసినట్లయితే అందరూ అగ్రకులాల వారే అని కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పీసీసీ ప్రెసిడెంట్ బీసీకి, ఏఐసిసి అధ్యక్షున్ని ఎస్సీ నాయకునికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నది కాబట్టి బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీంపట్నం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి నాంపల్లి వెంకటాద్రి, యామాపూర్ సహకార సంఘం చైర్మన్ అంకతి రాజన్న, బుర్రి ముత్తన్న, తరి రామానుజన్, గొడిసెల వెంకటేశ్ మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు