

చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం.. అనే నినాదంతో మేక్ ఏ చేంజ్ సొసైటీ కందుకూరు వారి సహకారంతో ఈరోజు కందుకూరు మండలం ప్రశాంతి నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పలకలు,వాటర్ బాటిల్స్,నోటు పుస్తకములు,బోధనా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా MEO 1 అజయ్ బాబు,MEO 2 సుబ్బారెడ్డి గార్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేక్ ఏ చేంజ్ సొసైటీ ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారికి అవసరమైన విద్యాసామాగ్రిని వారి సంస్థ ద్వారా అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని,ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పలకలు,వాటర్ బాటిళ్లు,విద్యా సామాగ్రిని అందజేయటం ఎంతో మంచి కార్యక్రమం అని అన్నారు. ఇలాగే మేక్ ఏ చేంజ్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారిని అభినందించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మరియు తదితరులు విద్యార్థులనుదేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేక్ ఏ చేంజ్ సొసైటీ సభ్యులు పి.గౌతమ్ శివతేజ ,రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీనివాసులు, కోట కిషోర్,పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ద్వారకా రాణి, కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు తన్నీరు బాలాజీ, తొట్టెంపూడి శ్రీనివాసులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.