Listen to this article

జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యరు
ఉచితంగా కట్టుమిషన్లు

గ్రామీణ ప్రాంత మహిళలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు, ఎక్కైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కాట్రేనికోన మండలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర భూగర్భ వనరులు శాఖ మంత్రి రవీంద్ర.కు ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో కూటమి నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మండల పరిధిలో చెయ్యేరు గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల కుట్టిన దుస్తులను ఆన్ లైన్ ద్వారానే గాక ప్రభుత్వం పరంగా అమ్మకాలు సాగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలు అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంఎల్ సి పేరాబత్తుల రాజశేఖర్,నాయకులు గుత్తుల సాయి, నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి నాగు, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరాజు ,సర్పంచ్ చెల్లి సురేష్ బిజెపి జిల్లా ట్రెజరర్ గంది నానాజీ మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ సీనియర్ నాయకులు మట్ట సూరిబాబు, ట్రైనింగ్ టీచరు నూకల స్వాతి దుర్గ , ఆపరేటర్ దుబ్బల ధనలక్ష్మి, ఎంపీటీసీ గుత్తుల మహాలక్ష్మి, టి.డి.పి నాయకులు , నంద్యాల వెంకన్న బాబ
కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.