

జనం న్యూస్ 26 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించి మోసపోయిన పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. బుద్ధ అనే సంస్థ… యోగా టీచర్ ఉద్యోగానికి ఒక్కో నిరుద్యోగి నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసింది. ఫేక్ అడ్మిట్ లెటర్లు ఇచ్చి బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌కు శనివారం వచ్చారని తెలిసి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.