Listen to this article

జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మునగాల మండల పరిధిలోని నేలమరి గ్రామంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామ మహిళలు కప్పకాముడు ఆడారు.కర్రకు కప్పలు కట్టి వేపమండలు చుట్టి పూజలు చేశారు.ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం.కాగా మహిళలు చప్పట్లు కొడుతూ పాటలు పాడారు.అనంతరం కప్పలను వీధుల్లో ఊరేగించి ఊరి చివర బావిలో వేశారు.