

జనం న్యూస్,జూలై18,
అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు బాపనయ్య(63) అదృశ్యమైనట్లు కూతురు గోవిందమ్మ,అల్లుడు బిబిన్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలు దేరి పసుపు రంగు టీ షర్ట్, ఎరుపు రంగు షార్ట్ ధరించి బ్యాంకు పని మీద అచ్యుతాపురం కాలినడకన నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు వ్యక్తులు చూసి చెప్పడం జరిగిందిని,ఇంతవరకూ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు బంధువుల ఇళ్లలో వెతికినా అతని ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 16 వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోవిందమ్మ,బిబిన్ తెలిపారు. బాపనయ్య ఆచూకీ తెలిస్తే 75690 42207 ఫోన్ నెంబర్ కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.