Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 18 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ళును
అపహరించిన పాత నేరస్థుడు (ఎ-1) విజయనగరం పట్టణం, వి.టి. అగ్రహారం, బిసి కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పడాల రాము అలియాస్ డిజే ను, దొంగిలించిన మోటారు సైకిళ్ళును విక్రయించడంలో సహాయవడిన (ఎ-2) ఆమదాలవలస మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నవీన్ అలియాస్ టైసన్ (19సం.లు)ను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 11రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లును, 2 యమహా ఆర్ 15 మోటారు సైకిళ్ళును రికవరీ చేసినట్లుగా 1వ పట్టణ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 16న వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం 1వ, 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ళు చోరీకి గురవుతున్నాయని, వీటికి కారకులైన వారిని అరెస్టు చేసేందుకు నిఘా పెట్టామన్నారు. ఇందులో భాగంగా 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో సస్పెక్ట్ షీటు కలిగిన తోటపాలెం, వైఎస్ఆర్ నగర్కు చెంది, ప్రస్తుతం విటి అగ్రహారం బిసి కాలనీలో నివాసం ఉంటున్న (ఎ-1) ఉప్పడాల రాము అలియాస్ డిజేను అరెస్టు చేసామన్నారు. గతంలో కూడా ఉప్పడాల రాము అలియాస్ డిజే పై బైకు చోరీలకు పాల్పడినట్లుగా పలు కేసులున్నాయన్నారు. నిందితుడు రాము ఇటీవల జైలు నుండి విడుదలైన తరువాత మళ్ళీ బైకు చోరీలకు పాల్పడ్డారన్నారు. ఎ-1 ఉప్పడాల రాము వద్ద నుండి 7 మోటారు సైకిళ్ళును, ఎ-2 ముద్దాడ నవీన్ వద్ద నుండి 6 మోటారు సైకిళ్ళును రికవరీ చేసామన్నారు. రికవరీ చేసిన మోటారు సైకిళ్ళు విలువ రూ.26లక్షలు ఉంటుందన్నారు. ఉప్పడాల రాము చోరీ చేసిన మోటారు సైకిళ్ళును శ్రీకాకుళం జిల్లా ఆముదావలనకు తీసుకొని వెళ్ళి, అక్కడ ఎ-2 ముద్దాడ నవీన్ సహకారంతో విక్రయించే వాడన్నారు. 1వ పట్టణ పోలీసు స్టేషనుకు చెందిన 10 కేసుల్లో 8 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా ఆర్ 15 బైకులుకాగా, 2వ పట్టణ పోలీసు స్టేషనుకు చెందిన మూడు కేసుల్లో మూడు రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్ళు ఉన్నాయన్నారు. వీటిని కోర్టు ఆదేశాలతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎ-1 ఉప్పడాల రాము అలియాస్ డిజేను ఆర్టీసి కాంప్లెక్సు వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిలుతో అరెస్టు చేసినట్లు, విచారణలో అతడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన బైకులను, ఎ-2 ముద్దాడ నవీన్ ను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి ఆధ్వర్యంలో పని చేసిన 1వ పట్టణ ఎస్ఐ సురేంద్ర నాయుడు, హెచ్సీ ఎ.రమణారావు, కానిస్టేబుళ్ళు ఎన్.గౌరీశంకర్, పి.శివశంకర్,టి.శ్రీనివాస్, పి.మంజులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.