Listen to this article

సొంత ఖర్చులతో తను పనిచేస్తున్న పాఠశాలలో అభివృద్ధి పనులు

జనం న్యూస్, జులై 18, జగిత్యాల జిల్లా,

ఇబ్రహీంపట్నం మండలం: మండలంలోని వేములకూర్తి గ్రామంలో సొంత ఖర్చులతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి గ్రామంలోని నాయకులు సన్మానం చేశారు, వేములకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో ఎచ్ ఎం గా పనిచేస్తున్న ఎం. గంగామణి ఉపాధ్యాయురాలు 40, 000 వేల రూపాయల తన సొంత ఖర్చులతో పాఠశాల లో వాల్ కలర్స్, డోర్స్ కి కలర్స్ వేయించి పిల్లలకు బొమ్మలు తదితర సామాగ్రిని అందించారు. పాఠశాల ఆవరణను శుభ్రపరిచి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా నిలిచిన్నారు. ఈ సందర్బంగా RMP, PMP ఉమ్మడి జిల్లా సెక్రటరీ పెంట లింబాద్రి శుక్రవారం పాఠశాల ఆవరణలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం సారంగపాణి, ఎస్సీ కాలనీ స్కూల్ హెచ్ఎం శంకర్, ఎస్ఎంసి చైర్మన్ భవాని, వేముల కుర్తి విడిసి చైర్మన్ గుమ్మల గంగన్న, దేవాలయ కమిటీ చైర్మన్ నాంపల్లి వెంకటాద్రి, లింగం, పుప్పాల నగేష్, బక్కి నవీన్, కోట రామానుజం, మగ్గిడి రవి, బుర్రి ముత్యం, రెడ్డవేణి లక్ష్మినర్సయ్య, బెజ్జరపు శ్రీనివాస్, బెజ్జరపు శ్రీకాంత్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.