

జనం న్యూస్ జూలై 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది మునగాల మండల పరిధిలోని ఆకుపాముల లోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి కోదాడ షీ టీమ్ ఎస్సై మాధురి మాట్లాడుతూ…విద్యార్థులు సైబర్ నేరాల పైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా బెట్టింగ్ యూప్ లు, ఆన్లైన్ గేమింగ్ యూప్ ల మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. లోన్ యూప్ ల ఉచ్చులో పడి తమ ప్రాణాలను తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. యువత గంజాయి మత్తులో పడి, దానికి బానిస అయ్యి తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారని గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెసేజ్ ల రూపంలో గానీ, ఫోన్ లు చేసి గాని, మహిళల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడిన చట్టపరంగా కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ అప్పారావు, షీ టీమ్ మహిళ కానిస్టేబుల్ సాయి జ్యోతి, కళాశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
