Listen to this article

జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి


ఆషాడమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాట్రేనికోన గ్రామ దేవత శక్తీస్వరూపణీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి పుష్పాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు ఫణికాంత్ శాస్త్రి, ఆధ్వర్యంలో తొలుత వినాయకుని పూజ, అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాభిషేకాలు మరియు సహస్ర కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రాష్ట్ర బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు, గ్రంధి సత్తి బాబు , గ్రంధి నారాయణమూర్తి, తాతపూడి బుల్లి, స్థానిక మహిళలు తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.ఆషాడ మాసం ఆఖరిశుక్రవారం సందర్భంగా పుష్పాలంకరణలో మావుళ్ళమ్మ తల్లి భక్తులకు దర్శనం ఇచ్చారు.