


జనం న్యూస్ జనవరి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారులు మరియు ఉపాద్యాయులు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఓటు ప్రాముఖ్యత గురించి స్థానిక తహశీల్దార్ మాట్లాడుతూ రాజ్యాంగం కలిపించిన హక్కులలో ఓటు హక్కు ఉత్తమైనది.ప్రజాస్వామ్య వ్యవస్థలో జాతి,మత,లింగ, ధనిక, పేద అనే భేదం లేకుండా అందరూ సమానంగా ఓటు హక్కు వినియోగించుకునే తందుకు రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు కలిపించారు అని మాట్లాడారు.విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు.గెలుపొందిన విద్యార్థులకు తహశీల్దార్ శ్రీలత, ఎంపిడివో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమాచారి, ఉపాద్యాయులు పాల్గొన్నారు