

జనం న్యూస్ జూలై 18(నడిగూడెం)
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల లో జూనియర్ లెక్చరర్ జువాలజీ పోస్టు ఖాళీగా ఉన్నందున తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సిహెచ్. వాణి తెలిపారు. ఎమ్మెస్సీ లో సంబంధిత సబ్జెక్టు ఉండి బిఈడి పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 22 లోపు దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో అందజేయాలని కోరారు. మహిళా అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు మొబైల్ నెంబర్ 9704550274 ను సంప్రదించాలని అన్నారు.